‘ఆసరా’ పెన్షన్లు ప్రారంభించిన కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ప్రారంభమైంది. వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇకపై అందనుంది. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు అర్హులకు అందనున్నాయి. గత ప్రభుత్వాల్లా విచ్చలవిడిగా పెన్షన్లు ఇవ్వమని, అర్హులకు మాత్రమే పెన్షన్లు అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అనర్హులు పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని నాశనం చేశాయన్నారు. ఆర్డీవోతో చర్చించి అర్హులకే పెన్షన్లు అందిస్తామన్నారు. పాలమూరులో సీఎం ఆసరా పథకాన్ని ప్రారంభించిగా, మెదక్ లో మంత్రి హరీష్ రావు, కరీంనగర్ లో మంత్రి కేటీఆర్, జగిత్యాలలో ఈటెల స్కీంను స్టార్ట్ చేశారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, స్టేషన్ ఘన్ పూర్ లో డిప్యూటీ సీఎం టి.రాజయ్య పథకాన్ని ప్రారంభించారు.

  • మనిషికి 6కిలోల రేషన్ బియ్యం, ఎంత మంది ఉంటే అన్ని 6కిలోలు ఇస్తాం.
  • జిల్లాలో 5వేల కిలో మీటర్లు రోడ్లు.
  • ఏడాదిలో ఛత్తీస్ గడ్  నుంచి కరెంట్.
  • మూడేళ్లలో 24 గంటల పాటు కరెంట్.
  • రైతుల రుణాలు మాఫీ చేశాం.
  • రూ.30 వేల కోట్లతో తెలంగాణ వాటర్ గ్రిడ్.
  • ఏటా 9వేల చెరువుల పునరుద్దరణ.
  • నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్.
  • నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే ఓట్లు అడగం.
  • త్వరలోనే కొత్త రేషన్ కార్డులు.
  • ఈ ఏడాది 1700 చెరువుల పునరుద్దరణ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy