ప్రభుత్వ ఉద్యోగులకు స్వగృహ ప్లాట్లు

SWAGRUHAహైదరాబాద్ లో నిర్మించిన స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అమ్మాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. స్వగృహ ఫ్లాట్లు కేటాయిస్తున్నామన్నారు.. హౌజింగ్ సెక్రటరీ చిత్ర రాంచంద్రన్. టీఎన్జీఓలు, టీజీఓలు, ఉపాధ్యాయ, డ్రైవర్ల సంఘాలు.. ఇలా 8 ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు.. హౌజింగ్ సెక్రటరీ. ఫ్లాట్ల అమ్మకానికి GO నంబర్ 201 విడుదల చేశామని చెప్పారు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఓకే అంటే.. రెండు నెలల్లో వాటిని కేటాయిస్తామన్నారు.

బండ్లగూడ స్వగృహలో.. పూర్తయిన ఫ్లాట్లు స్క్వేర్ ఫీట్ కు 19 వందలు, నిర్మాణంలోని ఫ్లాట్లను స్క్వేర్ ఫీట్ కు 17వందల రూపాయల ధర నిర్ణయించారు. పోచారం ప్రాంతంలోని పూర్తయిన ఫ్లాట్లకు 17వందలు, నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లకు 15వందల రూపాయలు ధర నిర్ణయించారు. వీటిని కొనుగోలు చేయాలనుకునేవాళ్లు… www.rajivswagruhaap.gov.in లో ఫామ్స్ డౌన్ లోడ్ చేసుకుని, వెయ్యి రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఎంప్లాయ్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్, సాలరీ సర్టిఫికెట్స్ జతపర్చాల్సి ఉంటుంది.

బండ్లగూడ స్వగృహ ప్రాజెక్టులో.. ఏ-కేటగిరి కింద పూర్తయినవి త్రీ BHK 132 ఫ్లాట్స్, బి కేటగిరి కింద రెండున్నర BHK ప్లాట్స్ 36, సీ కేటగిరి కింద డబుల్ బెడ్ రూం ప్లాట్స్ 37, డీ కేటగిరి కింద సింగిల్ బెడ్ రూం 111 ప్లాట్స్ ఉన్నాయి. నిర్మాణంలోని ఫ్లాట్లలో.. ఏ-కేటగిరీ కింద 3BHK ఫ్లాట్స్ 216, బీ కేటగిరీ కింద రెండున్నర BHK ప్లాట్స్ 408, సీ కేటగిరి కింద 674 ఫ్లాట్లున్నాయి. డీ కేటగిరీ కింద సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 631 ఉన్నాయి.

పోచారం స్వగృహ ప్రాజెక్టులో పూర్తయిన ఫ్లాట్లు ఏ-కేటగిరీలో 3BHK రెండున్నాయి. బీ-కేటగిరీలో ఫ్లాట్లు లేవు. సీ-కేటగిరీలో 2BHK ఫ్లాట్స్ 884 ఉన్నాయి. డీ-కేటగిరీలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్లు 82 ఉన్నాయి. నిర్మాణంలోని ఫ్లాట్లు.. ఏ-కేటగిరీలో 3BHK 90, బీ కేటగిరీలో రెండున్నర BHK ఫ్లాట్స్ 53 ఉన్నాయి. సీ కేటగిరిలో ఫ్లాట్లు లేవు. డీ కేటగిరిలో సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్ 360 ఉన్నాయి.

స్వగృహ ప్రాజెక్టులోని ఫ్లాట్లను ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు హౌజింగ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్. బండ్లగూడలో పూర్తయిన ఫ్లాట్లను స్క్వేర్ ఫీట్ కు 12వందలు, నిర్మాణంలో ఉన్నవాటిని 950 రూపాయలకు ఇవ్వాలంటున్నారు.. ఉద్యోగ సంఘాల నేతలు. పోచారంలో పూర్తయిన ఫ్లాట్లు స్క్వైర్ ఫీట్ కు 11 వందలు, నిర్మాణంలో ఉన్నవాటిని 850 రూపాయలకు ఇవ్వాలంటున్నారు.

చాలాకాలంక్రితం కట్టిన ఫ్లాట్లు కాబట్టి.. కేవలం ఫ్లాట్ విస్తీర్ణానికే ధర చెల్లించేలా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు ఉద్యోగ నేతలు. కామన్ ఏరియాను ఫ్లాట్ ధరలో కలపొద్దని అంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy