ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి:శశికళ

sasi 1AIADMK జనరల్ సెక్రటరీ శశికళా నటరాజన్ గవర్నర్ ను కలిశారు. ఇంటి నుంచి నేరుగా మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లిన ఆమె.. అక్కడ నివాళులర్పించారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పేపర్లను సమాధిదగ్గర కాసేపు ఉంచారు. తర్వాత వాటిని తీసుకుని రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్ భవన్ లో గవర్నర్ తో 20 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లెటర్లను గవర్నర్ కు అందజేశారు. 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy