ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్

rakulతెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇటీవలే ఓ బాలీవుడ్‌ సినిమాలో అవకాశం వచ్చింది. అలా బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకాన్ని తెలంగాణలో ప్రమోట్ చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభుత్వం నుంచి అవకాశం అందుకుంది రకుల్.

తన నియామకాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపిన రకుల్‌ప్రీత్ సింగ్.. సమాజంలో మార్పు మొదలవడానికి కృషిచేద్దాం అంటూ ట్విటర్ లో ట్వీట్ చేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy