ప్రభుత్వ పాఠశాలల్లో ‘చిన్నారి డాక్టర్‌’

STUDENTSప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారి డాక్టర్‌ అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలో పాఠశాలలు, గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. బుధవారం(ఆగస్టు-16) హన్మకొండ లష్కర్‌బజార్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ ఆమ్రపాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతి నుంచి ఉత్సాహవంతులైన విద్యార్థులను 5 మందిని చిన్నారి డాక్టర్‌ బృందంగా ఎంపిక చేస్తామన్నారు. ఒక టీచర్‌ పర్యవేక్షణలో వారు తోటి మిత్రులకు జ్వరం, జలుబు, కడుపునొప్పి లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే మాత్రలు అందజేస్తారన్నారు. ఏ వయసు వారికి ఎలాంటి మోతాదు మాత్రలు అందించాలనే విషయంలో ఎంపిక చేసిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ కల్పిస్తామన్నారు.

వైద్య చిట్కాలతోపాటు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అంశాలపై చిన్నారి డాక్టర్లు కృషి చేస్తారన్నారు. వారంలో ఒక రోజు అవగాహన పెంపొందించడానికి ప్రత్యేక తరగతితులు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. గురువారం నుంచి 25 సెప్టెంబరు వరకు నిర్వహించే రూబెల్లా, తట్టు వ్యాక్సిన్లను 9 నెలల నుంచి 15 ఏళ్ల వయసులోపు పిల్లలందరికీ వేయించాలన్నారు. బాల్య వివాహాలు జరిగినట్లు తమ దృష్టికి తీసుకొస్తే రూ.5 వేల రివార్డు అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించిన మొదటి వ్యక్తికి మాత్రమే రివార్డు ఉంటుందన్నారు. పోలీస్‌ కమిషనర్‌ జి.సుదీర్‌బాబు మాట్లాడుతూ.. ఆత్మరక్షణకు షీటీంలు ఉన్నాయని ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తేవాలన్నారు. ఇందుకోసం 94910 89257 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.  అనంతరం కలెక్టర్‌ ఆమ్రపాలి చేతుల మీదుగా చిన్నారి డాక్టర్లకు వైద్య కోటు అందించారు. పాఠశాల ఆవరణలో సీపీతో కలిసి మొక్కలు నాటారు కలెక్టర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy