ప్రభుత్వ బడుల్లో డిజిటల్ పాఠాలు

GOVERNMENT schoolsగవర్నమెంట్ స్కూళ్లలో నాణ్యమైన విద్య  అందించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజిటల్ క్లాసుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక పరిజ్ఝానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో డిజిటల్ క్లాసులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు నిర్వహణకు ప్లాన్ చేస్తోంది.

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో విద్యనందించేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. డిజిటల్ క్లాసులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో విద్యార్థుల డ్రాప్ అవుట్ తగ్గడంతో పాటు.. ఎన్ రోల్ మెంటు కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 450 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ క్లాసుల్లో విద్యార్థులకు విజువల్ బేస్డ్ పాఠాలు  చెప్పడంతో ఈజీగా అర్దమవుతుందని చెబుతున్నారు టీచర్లు. పదో తరగతిలో తెచ్చిన సిసి విధానానికి ఇది ఎంతో యూత్ అవుతుందని చెప్పారు.

ఆర్ఎంఎస్ఏ కింద స్కూళ్లకిచ్చే నిధులతో.. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ క్లాసుల విధానం అమలు చేసేందుకు సిద్దమవుతోంది విద్యాశాఖ. గవర్నమెంట్ స్కూళ్లలో విద్యాశాఖ తీసుకొస్తున్న మార్పులపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్లాసులపై విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్లాక్ బోర్డుపై ఎక్స్ ప్లేన్ చేసేదానికి.. విజువలైజేషన్ ఎక్స్ ప్లేనేషన్ కు చాలా తేడా ఉందంటున్నారు. లెస్సెన్స్  ఈజీగా అర్థమవుతున్నాయని చెబుతున్నారు. డిజిటల్ క్లాసుల కాన్సెప్ట్ బాగుందంటున్నారు స్టూడెంట్స్. మరింతగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy