ప్రభుత్వ సరఫరాలో 10% మందులు నాసివే..

Medicines(2)దేశవ్యాప్తంగా మందుల నాణ్యత అంతంత మాత్రమేనని, నకిలీ మందులకు కొదవ లేదని ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ సరఫరా వ్యవస్థ, చిల్లర మందుల దుకాణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి ధోరణే కనబడుతున్నట్టు బయటపడింది. చిల్లర దుకాణాలతో పోలిస్తే ప్రభుత్వ సరఫరా వ్యవస్థలో నాసిరకం మందులు మూడు రెట్టు ఎక్కువగా ఉంటుండటం గమనార్హం. చిల్లర మందుల దుకాణాల్లో 3% మందులు నాసివి..నకిలీ మందులు 0.023% ఉంటుండగా..ప్రభుత్వ వ్యవస్థలో 10.2% మందులునాసివి, 0.059% మందులు నకిలీవి ఉంటున్నట్టు తేలింది. ఇక ప్రభుత్వ సరఫరా వ్యవస్థ, చిల్లర దుకాణాలన్నింటినీ కలిపి చూస్తే.. దేశవ్యాప్తంగా 3.16% మందులు నాసివి..0.0245% మందులు నకిలీవి ఉన్నట్లు వెల్లడైంది. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వతంత్ర సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్ ఐ బీ) ఈ సర్వేను నిర్వహించింది. మందుల నాణ్యతను పసిగట్టే విషయంలో ప్రపంచంలో ఇదే అతి భారీ సర్వే అని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో తప్పనిసరి మందుల జాతీయ జాబితాలోని 15 రకాలకు చెందిన 224 ఔషధ మూలకాలను పరిశీలించారు. దేశవ్యాప్తంగా 654 జిల్లాల నుంచి 47,954 మందుల నమూనాలను సేకరించి పరిశీలించారు. ప్రభుత్వ వనరులతో పాటు చిల్లర దుకాణాలు, విమానాశ్రయాలు,నౌకాశ్రయాల నుంచి కూడా మందుల నమూనాలను సేకరించారని ఆరోగ్యశాఖ వివరించింది. ప్రభుత్వ సరఫరా వ్యవస్థలో నాసిరకం మందులు తెలంగాణ, మేఘాలయ, మిజోరం,అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా (11.39-17.39%) ఉంటుండగా..చండీగఢ్, డిల్లీ, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అతి తక్కువగా (0-7,93%)  ఉంటున్నాయి. విమానాశ్రాయాలు, నౌకాశ్రయాల నుంచి సేకరించిన నమూనాల్లో నాసిరకం, నకిలీ మందులేవీ కనబడలేదు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy