ప్రమాణ స్వీకారం చేసిన బాబు టీం..

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 19 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తన కేబినేట్ లో 6 గురు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇక సీనియర్ నేతలకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టారు. భాగస్వామ్య పక్షం బీజేపీ కి కూడా తన టీంలో రెండు మంత్రి పదవులు కేటాయించారు చంద్రబాబు. ఇక తన కాబినేట్ లో ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. పరిటాల సునీత, కిమిడి మృణాళిని, పీతల సుజాలకు మంత్రులుగా బాబు అవకాశం ఇచ్చారు.

  • కేఈ కృష్ణమూర్తి..పత్తికొండ ఎమ్మెల్యే
  • యనమల రామకృష్ణుడు…ఎమ్మెల్సీ
  • ఎన్. చినరాజప్ప.. పెద్దాపురం ఎమ్మెల్యే
  • అయ్యన్న పాత్రుడు…నర్సీపట్నం ఎమ్మెల్యే
  • బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి…శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
  • దేవినేని ఉమా… మైలవరం ఎమ్మెల్యే
  • నారాయణ…ఏ సభలోనూ సభ్యుడు కాదు
  • పరిటాల సునీత…రాప్తాడు ఎమ్మెల్యే
  • ప్రత్తిపాటి పుల్లారావు…చిలకలూరి పేట ఎమ్మెల్యే
  • కామినేని శ్రీనివాసరావు… బీజేపీ ఎమ్మెల్యే(తొలిసారి)
  • గంటా శ్రీనివాసరావు..భీమిలీ ఎమ్మెల్యే
  • పల్లె రఘనాథ్ రెడ్డి..పుట్టపర్తి ఎమ్మెల్యే
  • పీతల సుజాత..చింతలపూడి ఎమ్మెల్యే
  • కింజరాపు అచ్చెన్నాయుడు..టెక్కలి ఎమ్మెల్యే
  • శిద్దా రాఘవరావు.. దర్శి ఎమ్మెల్యే(తొలిసారి)
  • కిమిడి మృణాళిని… చీపురు పల్లి ఎమ్మెల్యే(తొలిసారి)
  • కొల్లు రవీంద్ర… మచిలీపట్నం ఎమ్మెల్యే(తొలిసారి)
  • రావెల కిశోర్ బాబు… ప్రత్తిపాడు ఎమ్మెల్యే(తొలిసారి)
  • మాణిక్యాల రావు… తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే (బీజేపీ) (తొలిసారి)

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy