ప్రమాదం లేదు: భూమికి అతి దగ్గరగా గ్రహశకలం

earthవిశ్వం నుంచి నిత్యం అనేకానేక ఆస్టరాయిడ్స్( గ్రహశకలాలు) దూసుకొస్తూంటాయని.. అందులో కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ ఆస్టరాయిడ్ (గ్రహశకలం) భూమికి అతిదగ్గరగా రాబోతోంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ సంఘటనను ఒక అవకాశంగా మలుచుకుంటోంది. భూమివైపు దూసుకొచ్చే ఆస్టరాయిడ్స్ ను కనిపెట్టేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.

వీటిని గమనించేందుకు నాసా ఆధ్వర్యంలోని ప్లానెటరీ డిఫెన్స్‌ కో ఆర్డినేషన్‌ ఆఫీస్‌ పనిచేస్తోంది. తాజాగా 2012 టీసీ4 అని పేరు పెట్టిన ఓ గ్రహశకలం భూమికి కేవలం 6,800 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకెళ్లనుంది. ఈ గ్రహశకలాన్ని తాము 2012లోనే గుర్తించామని అయితే అప్పట్లో ఇది వారం రోజుల పాటే పరిశీలనలకు అందుబాటులో ఉందని అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్త విష్ణురెడ్డి తెలిపారు. ఇప్పుడు దీన్ని మరింత డీప్ గా స్టడీ చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy