వరద గోదారి ఉరకలేస్తోంది!

AP-on-alert-as-Godavari-touches-danger-mark-620x330గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు గోదావరికి చేరుతోంది.  భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 38 అడుగులకు చేరింది. ఈ ఏడాదిలో ఇదే గరిష్ట నీటిమట్టమని తెలిపారు అధికారులు. సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందన్నారు అధికారులు. స్నానాల ఘట్టాల దగ్గర హెచ్చరికల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం మాలయం చుట్టుపక్కల నీళ్లు చేరడంతో భక్తులు ఇబ్బందులపడుతున్నారు.

KMM_THUMMQALA MUNNERU VISIT 00010513మరోవైపు మున్నేరు వాగును పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు. వరదలు వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy