ప్రమాదాలకు చెక్.. ట్రాక్ పొడవునా గోడ నిర్మాణం

దేశంలో రోజు రోజుకీ రైల్వే ట్రాక్ ల పై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో సుమారు 50 వేల మంది రైల్వే ట్రాక్ ల పై ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే పంజాబ్ లోని  అమృత్ సర్ లో రైల్వే ట్రాక్ పై నిల్చున్న వారి పై నుంచి ట్రైన్ వెళ్లడంతో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క సంఘటనే కాదు.

దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంది. ఈ ప్రమాదాలతో అలర్ట్ అయిన రైల్వే శాఖ ట్రాక్ ల పై యాక్సిడెంట్లను నివారించేందుకు  చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా రైల్వే ట్రాక్‌ల పొడవునా 3వేల కిలోమీటర్ల మేర గోడ కట్టేందుకు సిద్ధమైంది. రూ. 2,500కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు రైల్వే మినిస్ర్టీ ప్లాన్ రెడీ చేస్తోంది.  ట్రాక్‌కు రెండు వైపులా 2.7 మీటర్ల ఎత్తులో సిమెంట్‌, కాంక్రీట్‌ గోడను నిర్మించనుంది. నివాస ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో ఈ నిర్మాణం చేపట్టనుంది. ‘గోడ కట్టడంతో రైల్వే ట్రాక్‌లను దాటడానికి అవకాశం ఉండదు. దీంతో ప్రమాదాలు తగ్గుతాయి. అంతే కాక పశువులు ట్రాక్ పై రావడానికి వీలుండదని’ రైల్వే బోర్డు మెంబర్ విశ్వేశ్‌ చౌబే తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy