ప్రమాదాలకు చెక్ : రోడ్డు భద్రతపై కొత్త చట్టం

ktr-roadరోడ్డు ప్రమాదాల నివారణకు కీలక సూచనలు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. మాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో జరిగిన కమిటీ రెండో సమావేశంలో దీనిపై చర్చించారు. మంత్రులు తుమ్మల , కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. రోడ్లపై జనం చనిపోతున్నారనీ, ఈ ప్రమాదాలు తగ్గించాలని వివరించారు మంత్రులు. ఇందుకోసం ప్రత్యేకంగా అథారిటీ ఏర్పాటు చేసి దానికి చట్టబద్దత కల్పించి రోడ్డు భద్రతను పెంచుతామన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు సీఎం కేసీఆర్‌కు అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ప్రమాదాల నివారణ, రహదారి భద్రత అంశాల్లో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉన్నదన్నారు. ఇంకా మెరుగైన స్థితికి చేరుకునే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని వర్గాలతో చర్చించి ప్రణాళికను తయారు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, మేడ్చల్ జిల్లా రవాణాశాఖ అధికారి పుప్పాల శ్రీనివాస్, వివిధ సంస్థలకు చెందిన రోడ్డు భద్రతా నిపుణులు సమగ్రమైన నివేదికలను అందించారు. వీటిపై కూడా ఉపసంఘం సభ్యులు అధ్యయనం చేసి మెరుగైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy