ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు KNT శాస్త్రి కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు KNT శాస్త్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 1948 సెప్టెంబర్ 5న కర్ణాటకలో జన్మించిన శాస్త్రి… హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తక్కువ బడ్జెట్ లో సందేశాత్మక చిత్రాలు తీసి 12 అంతర్జాతీయ, 7 జాతీయ, 2నంది అవార్డులను పొందారు శాస్త్రి. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు అవార్డుల పంట పండించిన దర్శకుడు, రచయిత, విమర్శకుడు కేఎన్ టీ శాస్త్రి. ఆయన దర్శకత్వం వహించిన …తిలదానం, కమ్లి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దర్శకుడిగా రెండు, సినీ విమర్శకుడిగా, రచయితగా నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు శాస్త్రి. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో రెండు నంది అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ గా ఉన్నారు. తెలుగు, కన్నడ సినిమాలు తీసిన శాస్త్రి… చివరగా ఖోఖో ప్రధాన అంశంగా ‘శాణు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

వివిధ పత్రికల్లో సీనియర్ జర్నలిస్టుగా కేఎన్ టీ శాస్త్రి తన కెరీర్ ను ప్రారంభించారు. సినీ విమర్శకుడిగా సినీరంగంపై పలు పుస్తకాలు రాశారు శాస్త్రి. సురభి నాటకం డాక్యుమెంటరీకి నేషనల్ అవార్డు వచ్చింది. తిలాదానం సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. బాలీవుడ్ నటి నందితాదాస్ హీరోయిన్ గా తీసిన కమిలి మూవీ..దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తో పాటు మరో పది దేశాల్లో మంచిపేరు సంపాదించింది. ఆ సినిమాకు కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ అవార్డు అందుకున్నారు శాస్త్రి. నందితదాస్ సైతం ఉత్తమ నటిగా అవార్డు తీసుకున్నారు. తిలాదానం సినిమాకు కూడా శాస్త్రి నంది అవార్డు అందుకున్నారు.

ఎప్పుడూ పెద్ద నటులు, భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లలేదు శాస్త్రి. చిన్న బడ్జెట్ లో ఆయన తీసిన 10 సినిమాలు సైతం సందేశాత్మకంగా సమాజానికి అందించారు. KNT శాస్త్రి మృతి సినీ రంగానికి తీరని లోటుగా పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy