ప్రముఖ సాహితీవేత్త మచ్చ ప్రభాకర్ కన్నుమూత

macha-prabhakarప్రముఖ తెలంగాణ సాహితీవేత్త, రచయిత, కవి మచ్చ ప్రభాకర్ నిన్న(మంగళవారం) ముంబైలో మరణించారు. ప్రభాకర్ సిరిసిల్ల నుంచి నాలుగు దశాబ్దాల క్రితం ముంబైకి వలసపోయారు. అక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా తెలంగాణ సాహితీ ప్రపంచానికి ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముంబైలో తెలంగాణ ధూంధాం కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవలే ఆయన సతీమణి మృతిచెందారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన సిరిసిల్లలో జరిగాయి. పలువురు తెలంగాణ కవులు, రచయితలు ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ముంబైలో తెలంగాణ ఉద్యమవాణిని వినిపించిన కవి, రచయిత ప్రభాకర్ మృతి తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటన్నారు పలువురు తెలంగాణ కవులు, రచయితలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy