ప్రమోషన్లలో అప్ డేటెడ్ గా ఉండాలి: సీఎం కేసీఆర్

cmkcr-hitexపోలీసుల ప్రమోషన్లు అప్ డేటెడ్ గా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. పదోన్నతుల విషయంలో పైరవీల అవసరం ఉండకూడదన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సకాలంలో పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. పదవీ విరమణ పొందిన ఆఫీసర్లను అధికారిక వాహనంలో వారి ఇంటి వద్ద దింపి వచ్చే సంస్కృతి ఉండాలని ఆయన ఆకాక్షించారు.  ఆయన ఇంకేమన్నారంటే… ఎవరూ ఊహించని రాష్ట్రం కష్టపడి సాధించుకున్నాం. కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని సాధిస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. లక్ష్యం నెరవేరాలంటే.. పోలీసుల సహకారం కచ్చితంగా ఉండాలి. రాష్ట్ర ఆవిర్భావం కాకమునుపు… చాలా అపోహలు పెట్టారు. నక్సల్స్ పెరుగుతారని.. తీవ్రవాదులు వస్తారని.. పరిపాలనా అనుభవం లేదని.. ఇలా చెప్పుకుంటూ వచ్చారు. వాటి అన్నింటినీ పటాపంచలు చేసిన ఘనత పోలీసులదే. మనం ఎక్కడికి వెళ్లినా ప్రశంసలు దక్కుతున్నాయి. అటువంటి గొప్ప పని చేసి.. గొప్ప పేరు సంపాదించి పెట్టిన డీజీపీ.. మిగిలిన సిబ్బందికి కృతజ్ఞతలు. మనం పట్టుబడితే.. సాధించనిదంటూ ఏమీ లేదు.

మహిళా పోలీసులకు..

మహిళా పోలీసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వాళ్లకు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నారు. భోజన వసతి నుంచి రెస్ట్ రూమ్ వరకు అన్నింటిపైనా దృష్టిపెట్టాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy