ప్రయాణికుడిని ఈడ్చుకెళ్లిన రైలు…కాపాడిన రైల్వే పోలీసు


త్వరగా వెళ్లాలన్న ఆతృత ఆ ప్రయాణికుడి ప్రాణాల మీదకు తెచ్చింది. RPF పోలీస్ ధైర్యం ఆ యువకుడి ప్రాణాలు కాపాడింది. ముంబైలోని పన్వెల్ రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. పట్టుతప్పటంతో కదులుతున్న రైలు ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లింది. రైల్వేస్టేషన్ లో ఓ ప్రయాణికుడు కాపాడేందుకు ప్రయత్నించి ధైర్యం చేయలేకపోయాడు. ప్రమాదాన్ని గమనించిన రైల్వే పోలీస్… రైలుకు వేలాడుతున్న వెళ్తున్న వ్యక్తిని కాపాడాడు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. తొందరపాటు చర్యలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ రైల్వే అధికారులు మరోసారి సూచించారు. ప్రయాణికుడిని కాపాడిని రైల్వేసిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy