ప్రాజెక్టులపై ఆల్ పార్టీ మీటింగ్ లేనట్టేనా..?

ALL-PARTY-MEETING-AT-SCERTARIAT-ON-9-12-2014-10ప్రాజెక్ట్ ల రీ డిజైనింగ్ పై ఆల్ పార్టీ మీట్ ఇప్పట్లో  లేనట్టే కనిపిస్తోంది. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి నీటిని వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైడార్ సర్వే పూర్తికాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సర్వే పూర్తి అయితే గానీ ఆల్ పార్టీ మీట్ నిర్వహించే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది.

గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తిస్థాయి అవగాహనకు వస్తోంది ప్రభుత్వం. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం.. ఉన్న ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సర్కారు.. నదుల హద్దులు, ఎత్తు పల్లాలు, నీటి లభ్యత లాంటి లాంటి లెక్కలు తెలుసుకునేందుకు.. హై టెక్నాలజీతో పనిచేసే లైడార్ సర్వేను ఎంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరిపై సర్వే చేపట్టింది. దీని ద్వారా సమగ్ర జలవిధానాన్ని రూపొందించి…. అఖిలపక్షానికి అవగాహన కల్పించాలని డిసైడైంది. అయితే కొన్ని కారణాల వల్ల లైడార్ సర్వే పూర్తికాకపోవడంతో ఆల్ పార్టీ మీట్ ను కూడా వాయిదా వేసుకున్నారు సీఎం. ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ దగ్గరున్న వివరాలతో శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు సీఎం. ఇదే విషయంపై గవర్నర్ ను కూడా రెండు సార్లు మీటయ్యారు. కానీ అనూహ్యంగా సభ నుంచి విపక్ష సభ్యులు సస్పెండ్ కావడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఆ తరువాత ఆల్ పార్టీ మీట్ పెట్టి రాష్ట్రంలోని ప్రాజెక్టులపై సమగ్రంగా వివరించాలనుకున్నారు సీఎం. అయితే సర్వే పూర్తి కాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. లైడార్ సర్వే పూర్తయితేగానీ మొత్తం ప్రాజెక్టుల పురోగతి చెప్పలేమంటున్నారు అధికారులు. గత ప్రభుత్వాల హయాంలో… ప్రాజెక్టుల వివరాలు…. సాగునీటి కేటాయింపులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం…. ఇప్పటి వరకూ ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చు లెక్కలు సమగ్రంగా తెలుసుకున్న తరువాతే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ లో  ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఈ ప్రజెంటేషన్ తో ప్రాజెక్టులపై విపక్షాల ఆందోళనకు చెక్ పెట్టాలని డిసైడయ్యారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy