ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు

sriram sagarకర్నాటక, మహరాష్ట్రతోపాటు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో ఒక్కరోజే 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.నాసిక్ లోనూ భారీగానే వర్షం కురిసింది.  దీంతో కృష్ణా, గోదావరి నదుల్లో భారీ వరదలొచ్చే అవకాశం ఉందని,.,. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రజలవనరుల సంఘం.. ఇక కృష్ణాబేసిన్ లో శ్రీశైలం ప్రాజెక్టు క్రమంగా నిండుతోంది. జూరాలనుంచి 20వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చిచేరుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 825 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో క్రమ క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరడంతో మంగళవారం నాటికి ప్రాజెక్టు నీటి మట్టం 1077 అడుగులకు చేరింది.దీనితో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ వచ్చినట్లయ్యింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy