‘ప్రాజెక్ట్’ పనిలో పడ్డ లావణ్య

00feature-19-900x511టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, అందాల భామ లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ z.’  జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సి.వి కుమార్‌ తెరకెక్కించాడు. తమిళంలో ‘మాయావన్‌’ టైటిల్‌తో దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమైందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎస్‌.కె. బషీద్‌ మాట్లాడుతూ.. ‘ఆద్యంతం ఆసక్తి కలిగించేలా తెరకెక్కిన ‘మాయావన్‌’ను తెలుగు ప్రేక్షకులకు ‘ప్రాజెక్ట్‌z’ టైటిల్‌తో అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సారు సభ్యులు అభినందించి, యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. సందీప్‌ నటనను చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్దులవుతారు’ అన్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy