ప్రాణం ఖరీదు : ప్రైవేట్ స్కూల్ కు రూ.10 లక్షల ఫైన్

school-kid

మీ పిల్లోడు స్కూల్ కు వెళుతున్నాడా.. స్కూల్ లో టీచర్స్, యాజమాన్యం సరిగా పట్టించుకోవటం లేదా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా.. అయితే ఇక నుంచి గట్టిగా నిలదీయండి. కాదూకూడదు అంటే ఇక నుంచి జరిమానా తప్పదు. చిన్నారి స్కూల్ లో అడుగు పెట్టిన తర్వాత.. బాధ్యత అంతా స్కూల్ యాజమాన్యందే. అంతేకాదు.. ఇంట్లో మన పిల్లలను ఎలా అయితే చూసుకుంటామో.. ఎంత బాధ్యతగా వ్యవహరిస్తామో అలాగే పిల్లలను చూడాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంపై ఉందని సంచలన తీర్పు ఇచ్చింది నేషనల్ కన్య్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రసల్ కమిషన్ (NATIONAL CONSUMER DISPUTES REDRESSAL COMMISSION ) ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ మీరట్ లోని ఓ స్కూల్ లో 16 ఏళ్ల స్టూడెంట్ పదో తరగతి చదువుతున్నాడు. అప్పటి ఆ అబ్బాయికి అస్తమా ఉంది. 2003లో ఫైనల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. పరీక్షల హడావిడిలో ఇన్ హీలర్ మర్చిపోయాడు. స్కూల్ ఒక్కసారిగా అస్తమా ఎక్కువయ్యి ఊపిరిపీల్చుకోవటం కష్టమైంది. వెంటనే స్పందించాల్సిన టీచర్స్, స్కూల్ యాజమాన్యం పేరంట్స్ రాక కోసం వెయిట్ చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. బాలుడి సిస్టర్ వచ్చిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ స్టూడెంట్ చనిపోయాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. స్పందించిన తీరుపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు పేరంట్స్. ఈ కేసు తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది కమిషన్. స్కూల్ కి వచ్చిన పిల్లలను.. ఇంట్లో వారు ఎలా చూసుకుంటారో అలాగే వ్యవహరించాలని.. తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది. నిర్లక్ష్యానికి రూ.10లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి చెల్లించాలని స్కూల్ కు ఆదేశించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy