ప్రాణం తీసిన పరువు : కూతురిని కొట్టిచంపిన తండ్రి

DEATHపరువు ముసుగులో పడి, ఎంతో ప్రేమగా పెంచుకున్న కన్న కూతురినే కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. పరువు హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో శనివారం (జూన్-30) ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆ యువతి(24) బీటెక్‌ చదువుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy