ప్రాణం తీసిన వీడియో సరదా

vardhman-v6newsసెల్ ఫోన్ సరదా ప్రాణాల మీదకు తీసుకొస్తుందని తెలుసు… అయినా అందరూ దాని మాయలో పడిపోతున్నారు. సెల్ఫీస్.. వీడియోస్.. చాటింగ్స్.. ఇలా ఏదో ఒక పనిలో తమనే మర్చిపోతూ.. ప్రాణాలు తీసుకుంటున్నవాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా బోలెడు మంది ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ సెల్ ఫోన్ మోహం ఎంత ప్రమాదకరంగా మారిందో మరోసారి గుర్తు చేస్తోంది. పశ్చిమ్ బెంగాల్ వర్ధమాన్ ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు… ఓ నది దగ్గర ఈతకు వెళ్లారు. వీరిలో ఒకరు ఈత కొడుతుండగా మరో ఇద్దరు వీడియో తీస్తున్నారు. ఆ అబ్బాయి అలా ఈతకొట్టుకుంటూ.. కొంచెం లోపలికి వెళ్లబోతికి మునిగిపోయాడు. అయితే ఆ అబ్బాయి సాయం కోసం చెయ్యెత్తినప్పటికీ ఈ ఇద్దరూ సరిగ్గా పట్టించుకోలేదు. వీడియో కోసం ఏదైనా చేస్తున్నాడనుకున్నారు. వాళ్లు అసలు విషయం గుర్తించేటప్పటికి జరగాల్సినదంతా జరిగిపోయింది. వీడియో సరదా కాస్తా.. విషాదానికి దారితీయడంతో విద్యార్థి కుటుంబంతో పాటు స్థానికంగా విషాదం చోటుచేసుకుంది.

vardhman-v6

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy