ప్రాణానికి ప్రాణం : శరత్ ను చంపిన నిందితుడు కాల్చివేత

అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో వరంగల్ స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. కేన్సస్ లో కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను విడుదల చేశారు పోలీసులు. ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తించారు. ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో శరత్ ను చంపిన నిందితుడు చనిపోయాడు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నిందితుడు ఫొటోలను మాత్రమే విడుదల చేశారు.. అతని పూర్తి వివరాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదు. గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.

జూలై 7వ తేదీన అమెరికాలోని కన్సన్ లోని ఓ రెస్టారెంట్ లో ఈ నిందితుడే ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దోపిడీ కోసం వచ్చాడు. కాల్పుల నుంచి తప్పించుకుని పారిపోతున్న కొప్పు శరత్ ను వెనక నుంచి కాల్చి చంపాడు. వరంగల్ కొత్తవాడ వాసవీకాలనీ శరత్ ది. ఈ ఏడాది మొదట్లో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy