ప్రాణాలు కాపాడిన నవ వధువు

2CA27A6300000578-3244492-image-a-14_1442925754149చైనాలో ఓ పెళ్లి కూతురు.. మరో వ్యక్తి ప్రాణాలు రక్షించేందుకు వేగంగా ముందుకు వచ్చింది. చైనాకు చెందిన గూయాన్ యాన్… ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. దీంతో ఆమె ఇప్పుడు ‘అత్యంత అందమైన పెళ్లి కూతురు’గా సోషల్ మీడియా అందరి ప్రశంసలు అందుకుంటోంది. డాలియన్ సెంట్రల్ ఆస్పత్రిలో యాన్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. పెళ్లికి ముందు ఆమె ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించేందుకు ముందుకు కదిలింది. యాన్ పెళ్లి కూతురు దుస్తుల్లో ఉంది. సముద్రతీరంలో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఉన్నట్లుండి ఆమెకు సముద్రతీరంలో మునిగిపోతున్న వ్యక్తి కనిపించాడు.
2CA27A7300000578-3244492-image-m-10_1442925639715స్విమ్మింగ్ చేస్తున్న అతనికి గుండెపోటు రావడంతో అతను అచేతనంగా మారాడు. అంతే.. ఆ పెళ్లి కూతురు ఒక్క క్షణం ఆలోచించకుండా.. అక్కడకు చేరుకొని అతనిని ఒడ్డుకు చేర్చింది. అతని గుండె స్పందన ఆగిపోవడంతో.. గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో.. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని స్థానిక మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో, గూయాన్ యాన్ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత అందమైన కూతురు అంటూ కొనియాడారు. ఆమెను పెళ్లి చేసుకోబోయే యువకుడు కూడా ఆమె సాహసానికి మురిసిపోతున్నాడు.

2CA3F76E00000578-3244492-image-a-33_1442926948724

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy