ప్రారంభమైన కన్నడ పోలింగ్

karnatakaకర్ణాటకలో  అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్  ప్రారంభమైంది.  ఉదయం 7 గంటలకు  మొదలైన  పోలింగ్  సాయంత్రం 5 గంటల వరకు  జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా  ఒకే విడతలో  ఎన్నికలు జరుగుతున్నాయి.  మొత్తం 224 స్థానాలకు గాను …ప్రస్తుతం  222 సీట్లకు  ఓటింగ్ జరుగుతోంది . రెండు చోట్ల  పోలింగ్ వాయిదా  పడింది. బీజేపీ అభ్యర్థి  మృతితో …జయ నగర్, నకిలీ  ఓటరు  గుర్తింపు కార్డులు  భారీగా బయటపడంతో …R R నగర్ లో ఎన్నికలను  ఆపేసింది  ఈసీ.  వివిధ పార్టీల  నుంచి  మొత్తం 2 వేల  600 మంది  అభ్యర్థులు  పోటీలో ఉన్నారు.  మొత్తం 55 వేల  600 పోలింగ్  కేంద్రాలను  ఏర్పాటు చేశారు.  3 లక్షల 50 వేల  మంది ఉద్యోగులు ఎన్నికల  విధుల్లో ఉన్నారు.

రాష్ట్రంలో  మొత్తం 4 కోట్ల  96 లక్షల  మంది ఓటర్లున్నారు.  ఇందులో  2 కోట్ల 52 లక్షల  మంది పురుష ఓటర్లు,   2 కోట్ల  44 లక్షల  మంది మహిళా  ఓటర్లున్నారు. వీరితో పాటు… 4 వేల 552  ట్రాన్స్ జెండర్  ఓట్లు కూడా ఉన్నాయి.  పోలింగ్ సజావుగా  నిర్వహించేందుకు  ఈసీ కట్టుదిట్టమైన  ఏర్పాట్లు చేసింది.  దేశంలోనే తొలిసారిగా  దివ్యాంగులైన  ఉద్యోగులకు… వారికి  నచ్చిన  పోలింగ్ స్టేషన్ లో  విధులు నిర్వర్తించేందుకు అవకాశమిచ్చారు.  తొలిసారి  మొబైల్ యాప్ తో  పోలింగ్ స్టేషన్లలో  ఎంతమంది  ఓటర్లున్నారో  తెలుసుకునే ఏర్పాట్లు చేశారు.  ఇక కర్ణాటకలో  కురుస్తున్న వర్షాలు  అభ్యర్థులను  టెన్షన్ పెడుతున్నాయి. 2 రోజుల నుంచి రాష్ట్రంలో  పలుచోట్ల వానలు  పడుతున్నాయి.  ఇవాళ కూడా  వర్షం కురిసే  అవకాశముందని  వెదర్ రిపోర్ట్ చెబుతోంది.  దీంతో ఓటింగ్  పర్సంటేజ్  తగ్గుతుందని  ఆందోళన పడుతున్నారు  అభ్యర్థులు.

రాష్ట్రంలో అధికార  కాంగ్రెస్,  ప్రతిపక్ష బీజేపీ  మధ్య…. హోరా హోరీ  పోరు జరుతుందని  అంచనా. అటు జనతాదళ్  ఎస్ …కింగ్ మేకర్ గా  అవతరిస్తుందని  ఎగ్జిట్  పోల్స్  చెబుతున్నాయి. 1985 తర్వాత  కర్ణాటకలో ఏ పార్టీకి  వరుసగా  రెండోసారి  అధికారం  దక్కలేదు. ఇప్పుడు  రెండోసారి అధికారం  దక్కించుకొని  చరిత్ర తిరగరాస్తామంటోంది  కాంగ్రెస్. ఇక కర్ణాటకలో  గెలిచి  దక్షిణ భారతంలో  ఎంట్రీ ఇవ్వాలని  వ్యూహాలు రచించింది బీజేపీ.

కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలు  అన్ని పార్టీలకు  ప్రతిష్ఠాత్మకంగా  మారాయి. దీంతో  గతంలో ఎన్నడూ  లేనంతగా ఖర్చు పెరిగిందని  అంచనా.  గతంతో   పోల్చితే ….6 రెట్లు  అధికంగా డబ్బును  ఐటీ అధికారులు  తనిఖీల్లో పట్టుకున్నారు.  ఎన్నికల నోటిఫికేషన్  వచ్చినప్పటి  నుంచి  27 చోట్ల  చేసిన  దాడుల్లో …31 కోట్ల నగదు, 5.8 కోట్ల  గోల్డ్ సీజ్  చేశారు  అధికారులు.

ఈ నెల 15 న  ఎన్నికల ఫలితాలు  విడుదల కానున్నాయి.  ఇక సాయంత్రం 5 గంటలకు  పోలింగ్ ముగియగానే… వివిధ  సంస్థల  ఎగ్జిట్ పోల్స్  రిలీజ్  కానున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy