ప్రిన్స్ ఫిలిప్ రిటైర్మెంట్ ప్రకటన

The-Queen-and-Prince-Philip-2బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త, 95 ఏళ్ల ప్రిన్స్‌ ఫిలిప్‌ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తాను రాచరిక బాధ్యతల నుంచి వీడ్కోలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఫిలిప్‌ తీసుకున్న నిర్ణయానికి భార్య క్వీన్‌ ఎలిజబెత్‌ నుంచి పరిపూర్ణ మద్దతు లభించిందని తెలిపింది. ఫిలిప్‌ నిర్ణయం 91 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌ కార్యక్రమాల షెడ్యూల్‌పై ఏమాత్రం ప్రభావం చూపదని పేర్కొంది. ఫిలిప్‌.. జూన్‌ 10న 96వ పడిలోకి ప్రవేశించనున్నారు. ఫిలిప్ రిటైర్మెంట్ పై బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వచ్చే సెప్టెంబర్ నుంచి ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోరు. ఇందుకు రాణి పూర్తి మద్దతు ఉందని అందులో పేర్కొన్నారు. వయసు మీదపడ్డ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఆగస్టు వరకు ఇదివరకే ఖరారైన కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా విశ్రాంత జీవితం గడుపుతారు. దేశానికి అందించిన సేవలకు గానూ ప్రజల తరఫున ప్రధాని థెరెసా మే ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నవంబర్‌లో రాజదంపతుల 70వ వివాహ వార్షికోత్సవం జరుగబోతున్నది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy