ప్రియమణే కావాలన్న పవన్..

priyamaniహవా నడిచినన్ని నాళ్లు  ఓ ఊపు ఊపి.. తర్వాత ఫేడౌట్ అయిన హీరోయిన్స్ అలాగే తెరమరుగవ్వడం లేదు. తెలివిగా ట్రాక్ మార్చి కెరియర్ ను లాగేస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ ఇప్పుడు జోరుమీద సాగుతోంది. టాలీవుడ్ లో ఫేడవుట్ అయిన హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు ముందుకొస్తున్నారు. దాదాపు టెన్ ఇయర్స్ పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రియ.. ఫేడవుట్ అయ్యాక ఆఫర్స్ రాకపోవడంతో ఈ దారినే వెతుక్కుంది. చాలా సినిమాల్లో ఐటమ్ బాంబ్ గా నటిస్తూ.. అడపా దడపా హీరోయిన్ గా కూడా ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. ఇప్పుడు ఇదే దారిలో బ్లాక్ బ్యూటీ ప్రియమణి కూడా నడుస్తోంది. కొంత కాలంగా సినిమాలు లేక వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రియమణి.. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో కొత్త ట్రాక్ వెతుక్కుంది. బాలీవుడ్ సినిమా చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఐటమ్ సాంగ్ సక్సెస్ కావడంతో.. హీరోలు కూడా ప్రియమణిని దృష్టిలో పెట్టుకున్నారు.

pawan-priyamaniబాలీవుడ్ లో ప్రియమణి చేసిన ఐటమ్ సాంగ్ నచ్చిన పవన్.. తన సినిమాలో కూడా ప్రియమణి కావాలని కోరాడట. పవన్, వెంకటేష్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ సినిమాలో ప్రియమణి ఐటమ్ సాంగ్ లో నటిస్తోందని ఇండస్ట్రీ టాక్. ప్రియమణికి రెఫరెన్స్ ఇచ్చింది పవనేనని సమాచారం. అయితే ఈ సాంగ్ ఐటమ్ కాదని, స్పెషల్ సాంగని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియాలంటే.. పవన్ గానీ, ఆ సినిమా దర్శక నిర్మాతలు గానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy