ప్రేమకథతో ‘ఫిదా’ 

pidaవరుణ్ తేజ్, ‘ప్రేమమ్‌’ ఫేం సాయిపల్లవి నటీనటులుగా… శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫిదా. ఈ మూవీని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు, సాయి పల్లవి క్లాప్‌నివ్వగా  రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.  ఈ  సినిమా 40 రోజులపాటు బాన్సువాడలో షూటింగ్ జరుపుకుని తర్వాత షెడ్యూల్‌ను అమెరికాలో చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శక్తి కాంత్ సంగీతాన్ని అందించాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy