ప్రేమకు దూరమైన శ్రీకాంత్ ఆత్మహత్య

పాతబస్తీలో మరో ప్రేమపెళ్లి కథ విషాదంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్య చేసుకున్నాడు. సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగెళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోయారు.

దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, దళితుడు కావటంతోనే అతడు కక్ష్యగట్టాడని శ్రీకాంత్‌ బందువులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy