ప్రేమను నిరాకరించినందుకే : యువతిపై హోంగార్డు దారుణ హత్య

Sagar2పట్టపగలే ఓ ప్రేమోన్మాది.. ఓ యువతిని గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. బంగారు నగలు కట్  చేసే కట్టర్ తో దాడికి తెగబడి ప్రాణాలు తీశాడు. సోమవారం (మే-28) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ జవహర్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన నిందితుడు సాగర్‌ పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేస్తూ.. ఓ పోలీసు అధికారి వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి చెందిన అగ్గిరాముడు, అన్నపూర్ణ దంపతుల కూతురు వెంకటలక్ష్మి. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అగ్గిరాముడు మధురానగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తూ… ఇస్త్రీ షాపు నిర్వహిస్తున్నాడని సమాచారం. జవహర్ నగర్ లో కుటుంబంతో సహా అద్దెకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె 19 ఏళ్ల వెంకటలక్ష్మి.. కొన్నాళ్లు ఇళ్లల్లో పని చేసింది.

రెండు నెలల నుంచి జవహర్ నగర్ లోని జోడి ఫ్యాషన్ జ్యువెలరీస్ వన్  గ్రామ్  గోల్డ్  స్టోర్స్ లో పని చేస్తోంది. ఈ షాపు యజమానులు  దినేష్, జ్యోత్స్న.. నాలుగు రోజుల క్రితం వేరే ఊరికి వెళ్లడంతో వెంకటలక్ష్మి దుకాణం నిర్వహిస్తోంది. సోమవారం స్టోర్ తెరిచిన వెంకటలక్ష్మి మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో.. షాపు దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, తనను వేధిస్తున్నారని యజమానురాలికి ఫోన్  చేసి చెప్పింది.  మూడున్నర టైంలో ఓ యువకుడు షాప్ లోకి వచ్చాడు. అక్కడే ఉన్న బంగారు నగలు కట్ చేసే కట్టర్ తో వెంకటలక్ష్మిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న వెంకటలక్ష్మిని స్థానికులు కొద్దిసేపటి తర్వాత గమనించారు. స్థానికుల సమాచారంతో అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆరు నెలలుగా సాగర్  అనే యువకుడు తనను వేధిస్తున్నట్లు వెంకటలక్ష్మి తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమను నిరాకరించిన కారణంగానే సాగర్.. ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగానే కుట్ర పన్ని సాగర్  గత నాలుగైదు రోజులుగా ఆమెను వెంటాడుతూ, ప్రతి కదలికను గుర్తించినట్లు తెలుస్తోంది. దుకాణంలో ఒంటరిగా ఉందని, మధ్యాహ్నం కస్టమర్లు రద్దీ తక్కువగా ఉంటుందనే  ఉద్దేశంతో ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో సాగర్ కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు బయట కాపు కాయగా.. దుకాణంలోకి వెళ్లిన సాగర్  హత్యకు తెగబడినట్లు సమాచారం. గొంతు కోసిన తర్వాత సాగర్  ఆమె మెడలోని చున్నీతో ఉరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సాగన్ ను మధురానగర్ లో అదుపులోకి తీస్కున్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని విచారిస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy