ప్రేమించినందుకు శిక్ష: 12 మందితో రేప్ !?

mam

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సొంత జిల్లా లో దారుణం జరిగింది. మమతా బెనర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్ భూమ్ జిల్లాలోని సుబల్పూర్ అనే గ్రామంలో మంగళ వారం ఈ దారుణం జరిగింది. కలకత్తా కు 180 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలోని ఒక 20 ఏళ్ల యువతి వేరే కులం వ్యక్తితో ప్రేమలో ఉన్నదనే ఆరోపణపై విచారణ జరుపుతున్న గ్రామ పంచాయితీ యాభై వేల జరిమానా విధించిందట. అంత సొమ్ము కట్టలేమన్నందుకు పరిహారంగా పంచాయితీ అధ్యక్షుడితో సహా 12 మంది ఆ అమ్మాయిపై అత్యాచారం చేసారట. ఆ దారుణం ఎన్ని సార్లు జరిగిందో తాను లెక్క పెట్టే స్పృహ కూడా కోల్పోయానని ఆ అమ్మాయి చెప్పింది. తాను చిన్నానా, మామా, అన్నా అని పిలిచే వాళ్ళతో సహా చాలా మంది ఈ దారుణంలో పాల్గొన్నారని ఆ అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది.  ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ అమ్మాయి పరిస్థితి పై పూర్తీ వివరాలు ఇంకా తెలియలేదు.

ఈ మధ్యే కలకత్తా నడిబొడ్డున జరిగిన ఓ రేప్, మధ్యగ్రాం లో జరిగిన ఓ రేప్, తర్వాత హత్య లతో అట్టుడుకుతున్న బెంగాల్ ఈ సంఘటనతో మరింత ఆందోళనకరంగా మారింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy