ప్రేమ జంటను వెంటాడి మరీ కొట్టారు

beat2ఉత్తరాఖండ్‌లో మోరల్ పోలీసింగ్ పేరుతో ఓ ప్రేమజంటను స్థానికులు చితకబాదారు. రూర్కీ ఏరియాకు చెందిన యువతీ, యువకుడు బైక్‌పై వెళ్తుండగా కొందరు దాడి చేసి..నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. తమను వదిలివేయాలని ఆ జంట వేడుకున్నావిన్పించుకోకుండా… విచక్షణారహితంగా కొట్టారు. మహిళని  కూడా చూడకుండా చితకబాదారు. స్థానిక యువకులతో పాటు…మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఈ ఇన్సిడెంట్ లో ప్రేమ జంటకు తీవ్ర గాయాలయ్యాయి. బట్టలు  చినిగిపోయేలా వాళ్లని చావగొట్టారు. బెదిరిపోయిన ప్రేమికులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. వెంబడించి మరీ దాడి చేశారు. స్థానికులు కొందరు ఈ తతంగాన్ని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. వీటి ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.  ఈ నెల 17 ఈ ఇన్సిడెంట్ జరిగింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బయటపడింది.

beat3

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy