ప్రేమ పెళ్లి: కిరోసిన్‌ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో శ్రీకాంత్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

శ్రీకాంత్ (24)నల్గొండ జిల్లా నకిరేకల్ కి చెందిన శ్రీహర్ష (23)ను ప్రేమించి  16.12.2015 న లక్ష్మీ నగర్ లోని ఆర్యసామాజ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత తన భార్య శ్రీహర్ష ను నమ్మించి ప్రలోభాలకు గురి చేసి ఆమె తండ్రి బలవంతంగా తీసుకెళ్లాడాన్ని జీర్ణించుకోలేక గత ఆరు నెలల గా మనోవేదనకు గురై నిన్న(బుధవారం) అర్ధరాత్రి సంతోష్ నగర్ DRDL చౌరస్తా దగ్గర నడి రోడ్డుపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

స్థానిక పోలీసులకు సమాచారం అందడం తో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు తీవ్ర గాయాలపాలైన శ్రీకాంత్ ను వైద్య చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న యువతి తండ్రి గతంలో అనేక సార్లు బెదిరించినట్లు బాధితుడు  ఆరోపిస్తున్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఎర్రగడ్డలో మాధవి తండ్రి చేసిన దాడి మరువక ముందే ఇవాళ మరో ఘటన జరగడంపై నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy