ప్రైవేట్ స్కూల్ ఫైన్స్: తుమ్మితే రూ. 200.. మాట్లాడితే రూ.300

Student_sssప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల దాష్టికాలు ఒక్కోసారి మరీ వికృతంగా ఉంటాయి. తమిళనాడులో జరిగిన దారుణమే దీనికి తాజా ఉదాహరణ. తుమ్మితే రూ.200, తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధించి.. అభాసుపాలైంది. కోయంబత్తూరు జిల్లా సెట్టిపాళయంలోని పాఠశాలలో ఈ ఆకృత్యాలు చోటుచేసుకున్నాయి. 9వ తరగతి చదువుతున్న లక్ష్మీ అనే విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి కోయంబత్తూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. విద్యార్థులెవరైనా తుమ్మితే తమ పీటీ మాస్టర్‌ రూ.200 జరిమానా విధిస్తున్నాడని, ఒకటి కంటే ఎక్కువమార్లు తుమ్మితే స్కూల్ గ్రౌండ్ అంతా పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పింది. తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్నారని, ఒకటి కంటే ఎక్కువ సార్లు అలా జరిమానా కట్టిన విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది.

అంతేకాదు ఇంటి నుంచి తీసుకొచ్చిన నీళ్లు తాగొద్దంటున్నారని, పాఠశాల ట్యాంకులోని మురికి నీరే తాగాలని ఆదేశిస్తున్నారని పేర్కొంది. ఈ చర్యలతో విసిగిపోయిన విద్యార్థులు ఎవరైనా టీసీ అడిగితే రూ.15 వేలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఆ స్కూల్లో విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారని వివరించింది. స్పందించిన కలెక్టర్‌ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy