ప్లాన్ రెడీ అయ్యింది : మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ లకు భూములు గుర్తింపు

MULTILEVEL PARKINGసిటీలో పార్కింగ్  సమస్యలకు  చెక్ పెట్టే  దిశగా  అడుగులేస్తోంది  సర్కార్.  మల్టీలెవల్ పార్కింగ్  కాంప్లెక్స్ లు  నిర్మించాలని  నిర్ణయించింది.  దీనికి  సంబంధించి  ఇప్పటికే డిజైన్లు  పూర్తి  చేసిన  అధికారులు.. మొదటి  దశలో  ప్రభుత్వ  భూమిలో నిర్మించేందుకు ప్లాన్  చేస్తున్నారు. హైదరాబాద్ లోని ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలపై మేయర్ బొంతురామ్మోహన్ తో కలిసి అధికారులతో సమీక్షించారు సీఎస్ ఎస్ కే జోషి.

ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్ధలాలలో మల్టిలెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాలలో పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి భూములను గుర్తించామన్నారు. ఈ ప్రాంతాలలో ఆయా శాఖల అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్ ను యూనిక్ గా అభివృద్ధి చేయాలని, వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారిగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు సిఎస్. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి …. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలల్లో వినియోగిస్తున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.

నగరంలో రియల్ ఎస్టేట్ విస్తరించడంతోపాటు, వివిధ పరిశ్రమలు, విద్యాసంస్ధలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని, 100 గజాల నుండి 500 గజాల లోపు స్ధలాలలో చైన్ పార్కింగ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. మొదటి దశలో ప్రభుత్వ స్ధలాల్లో పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే పరిశీలించిన స్థలాలను బట్టి.. ప్రత్యేక డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్. ప్రభుత్వ స్ధలాలలో ఆయాశాఖలు తమ అవసరాలపై ప్రతిపాదనలను ఇవ్వలన్నారు అరవింద్ కుమార్. జర్మనీ, జపాన్, చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలలో అత్యుత్తమ టెక్నాలజీతో పార్కింగ్ చేపట్టారన్నారు మెట్రో రైల్ యం.డి   ఎన్.వి.యస్ రెడ్డి. మన నగరంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్  పద్ధతిలో కొత్త టెక్నాలజీతో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy