ప్లీజ్ రాజకీయాలొద్దు.. మా నాన్నది సహజ మరణమే

anuj-loya-justice-loyas-sonజస్టిస్ బీహెచ్ లోయా మృతిపై ఆయన కుమారుడు అనూజ్ లోయా పెదవి విప్పారు. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తేల్చిచెప్పారు. ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అనూజ్.. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని.. ఈ విషయంలో తమను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయం చేయొద్దని వేడుకున్నారు. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ బీహెచ్ లోయా 2014 డిసెంబర్‌లో చనిపోయారు. ఈ కేసులో అమిత్ షా నిందితుడిగా ఉన్నాడు. అయితే జస్టిస్ లోయా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారంటూ పలువురు లాయర్లు పేర్కొన్నారు. లోయా మరణంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పలువురు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ కేసు తీవ్రతను గమనించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలని చెప్పింది. అయితే ఈ కేసు ఇప్పటికే బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని.. దీన్ని సుప్రీంకోర్టు విచారించరాదని ప్రముఖ లాయర్ దుష్యంత్ దవే కోర్టును కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy