ప్లేయింగ్ కార్డ్స్: డైమండ్ 8లో ఓ కిటుకు ఉంది

ఏదైనా అకేషన్ కానీ..ఫంక్షన్ గానీ జరిగితే కొందరు టైం పాస్ కోసం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుంటారు. పేకలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి..ఎన్నికలర్స్, సింబల్ ఉంటాయని మాత్రం తెలుసు. అంతేకాదు కొన్నిటికి అర్ధాలు ఏంటని కూడా చెబుతుంటారు. కానీ నంబర్ 8 డైమండ్ గురించి అంతగా ఎరికీ తెలియదు. అందులో అంతగా పట్టించుకోని గుట్టును ఓ వ్యక్తి బయటపెట్టాడు. అదేంటో తెలుసా. కార్డు మధ్యలో చుక్కల మధ్య 8 ఆకారం ఉండటాన్ని అతను గుర్తించాడట. ఈ విషయాన్ని ట్విటర్‌ లో అతను తెలియజేశాడు. ఎనిమిదిలో 8 దాగుందన్న విషయం మొదటి సారి మీరు విన్నప్పుడు మీ వయసు ఎంత? అని ప్లింకెటీప్లింక్‌ యూజర్‌ నేమ్‌ తో  ఓ వ్యక్తి ట్విటర్‌ పోస్ట్‌‌‌‌ చేశాడు. ప్రశ్న చాలా సిం పుల్‌ అయినా.. కాసేపటికే ఆ ట్వీట్‌ తెగ వైరల్‌ అయ్యింది. చాలా మంది ఆ కిటుకును ఇప్పుడే చూశామంటూ బదులిచ్చారు. షాకింగ్‌ రియాక్షన్‌ లు, ట్రోల్స్‌‌‌‌ చేసినోళ్ల సంఖ్య కూడా చాలానే ఉంది. ఆవైరల్‌ ట్వీట్‌ కామెంట్‌ బాక్స్‌‌‌‌లో ఎనిమిది గురించి బాషా సినిమాలో రజనీకాంత్‌ పాటను కొందరు పెట్డడం విశేషం. పేకాటరాయుళ్లు కూడా ఈ విషయాన్నిఇప్పటిదాకా గుర్తించారో.. లేదో..? మరి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy