ప్లే ఆఫ్స్ రేసులో RCB : ఢిల్లీపై 5వికెట్లతో విక్టరీ

RCBప్లే ఆఫ్స్ ఆశలను నిలబెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. శనివారం (మే-12) మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 181 రన్స్ చేసింది. టార్గెట్ ను రీచ్ చేయడంలో ఆర్సీబీ బ్యాట్స్ మెన్ అద్బుతంగా ఆడారు. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 182 పరుగుల లక్ష్యాన్ని చేధించి.. ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ. ఈ ఓటమితో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. డివిలియర్స్ చివరి దాకా పోరాడి ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఏబీ డివిలియర్స్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 72 నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లి 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 70 రన్స్ చేయడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు సాధించగా, హర్షల్ పటేల్, లామించే, మిశ్రా తలో వికెట్ సాధించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy