ప్లే ఆఫ్ ఆశలు సజీవం : పంజాబ్ పై ముంబై విక్టరీ

mi winఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్ రేసులో వెనుకబడిపోయే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ సంచలనాత్మక ఆటతీరుతో చెలరేగింది.  శుక్రవారం మే-4 ఇండోర్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌ లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ పై గెలిచింది. ముంబై టాస్ గెలువగా.. పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సహా టాప్ ఆర్డర్ తలా కొన్ని పరుగులు జత చేసింది.

తర్వాత ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 25; 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. సూర్యకుమార్‌ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బౌలింగ్‌లో నిరాశపరిచినా.. లక్ష్య ఛేదనలో వ్యూహాత్మకంగా ఆడింది. ఆరంభంలో సూర్యకుమార్ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రతాపం చూపెట్టగా.. చివర్లో క్రునాల్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్ 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధికారిక ఇన్నింగ్స్‌ తో ఆకట్టుకున్నాడు. దీంతో వరుసగా ఎదురైన పరాజయాలకు చెక్ పెడుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అద్భుత విజయంతో నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.  గేల్ ఇచ్చిన శుభారంభాన్ని అందుకోవడంలో విఫలమైన పంజాబ్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy