ఫర్ ఛేంజ్ : టీ షాపులుగా మాంసం దుకాణాలు

teaకొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యోగి సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం సంచలనం అవుతుంది. ముఖ్యంగా కబేళాల మూసివేతతో ఇప్పటికే 25లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇప్పట్లో కబేళాలు తెరుచుకునే అవకాశం లేకపోవటంతో.. వాళ్లందరూ ప్రత్యామ్నాయ ఉపాధిపై మొగ్గుచూపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు చికెన్, మటన్ విక్రయాలు చేసిన దుకాణాలు సరికొత్తగా టీషాపులుగా మారిపోయాయి. దేశంలోనే ఎక్కువ బీఫ్ ఎగుమతిదారుగా ఉన్న ఆ రాష్ట్రంలో.. సొంతగడ్డపై నిర్వహించే హోటళ్లలో కూడా మాంసం అందుబాటులో ఉండటం లేదు. లక్షలాది మంది మాంసం అమ్మకందార్లు ఒక్కసారిగా జీవనోపాధి కోల్పోయారు. క‌బేళాలే ఆధారంగా డ‌బ్బు సంపాదించిన యూపీ వ్యాపారులు ప్రస్తుతం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కుంటున్నారు. ముజఫర్‌నగర్‌లో కొందరు మాంసం అమ్మకందారులు టీ వ్యాపారులుగా మారారు.

ప్రభుత్వ లైసెన్స్ ఉన్నప్పటికీ బలవంతంగా షాపులు మూసేయించారని.. దీంతో టీ స్టాల్ పెట్టుకోక తప్పలేదని మాంసం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ముజఫర్ నగర్ లోనే కొత్తగా 1200 టీషాపులు వెలిశాయి. మరోవైపు మాంసం వ్యాపారులు… కబేళా యజమానులు నాలుగు రోజులుగా సమ్మెకు దిగడంతో యుపీలో మాంసానికి తీవ్ర కొరత ఏర్పడింది. బీఫ్‌పై నిషేధం కారణంగా చికెన్, మటన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చేసేదేమీ లేక మ్యారేజ్ ఫంక్షన్లకు ఆకుకూరలతోనే కానిచ్చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy