ఫస్ట్ టీ20లో దక్షిణాఫ్రికా గెలిచింది

2iplcric03గాంధీ-మండేలా సిరీస్ ను ఘనంగా ప్రారంభించింది దక్షిణాఫ్రికా. ధర్మశాల వేదికగా జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో 7వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. డివిల్లీర్స్, డుమినీల అద్భుత బ్యాటింగ్, ఇండియన్ బౌలర్ల ఫెయిల్యూర్ సఫారీలకు గెలుపునందించాయి. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 20ఓవర్లలో 199 రన్స్ చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 3పరుగులకే ఔటయ్యాడు. అయితే కోహ్లీ సాయంతో మరో ఓపెనర్ రోహిత్ శర్మ సఫారీ బౌలర్లు క్రిస్ మోరిస్, డిలాంగే, ఇమ్రాన్ తాహిర్ లను టార్గెట్ చేస్తూ… పరుగుల వరద పారించారు. కోహ్లీ 27బాల్స్ లో 43రన్స్ చేసి ఔట్ కాగా… సెంచరీ కొట్టిన రోహిత్ 66బంతుల్లో… 5సిక్సర్లు, 12ఫోర్లతో 106రన్స్ చేసి… పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్ మెన్ లో రైనా 14 చేశాడు. రాయుడు డకౌట్ అయ్యాడు. ధోనీ 20, అక్షర్ పటేల్ రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.

2brk218add00200రన్స్ టార్గెట్ ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది సౌతాఫ్రికా. టార్గెట్ ఛేజింగ్ లో… సఫారీలు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఆమ్లా, డివిలియర్స్ లు ఫస్ట్ వికెట్ కు 77పరుగులు జోడించారు. ఆమ్లా 36రన్స్ చేసి ఔట్ కాగా… తర్వాత 51 రన్స్ చేసిన డివిలియర్స్ అశ్విన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 4రన్స్ కే ఔటయ్యాడు. అయితే బెహర్డీన్ తో జతకట్టిన డుమినీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 7సిక్సర్లు, 1 ఫోర్ తో డుమినీ 68 రన్స్ చేసి ప్రొటీజ్ కు గెలుపునందించాడు. బెహార్డిన్ కూడా 32రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.

2brk218add03డుమినీకి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక ఈ మ్యాచ్ లో అనేక రికార్డులు క్రియేట్ అయ్యాయి. టీ20ల్లో సెంచరీ కొట్టిన రెండో ఇండియన్ గా రోహిత్ శర్మ నిలవగా… టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇక 50ఇంటర్నేషనల్ టీ20లకు కెప్టెన్సీ చేసిన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. గాంధీ-మండేలా సిరీస్ లో టాస్ వేసేందుకు ఇద్దరి బొమ్మలతో BCCI ప్రత్యేకంగా కాయిన్ తయారు చేయించింది. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ లతో పాటు… ఫ్యూచర్ లో ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగే అన్ని సిరీస్ లకు అదే కాయిన్ తో టాస్ వేస్తారు. ఈ కాయిన్ పై ఓ వైపు గాంధీ-మండేలా బొమ్మలుండగా… మరోవైపు ఫ్రీడం సిరీస్ అని రాసి ఉంటుంది. ఈ సిరీస్ లో రెండో టీ20 మ్యాచ్ 5న కటక్ లో జరగనుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy