ఫిజిక్స్ లో ఇద్దరు సైంటిస్టులకు నోబుల్ అవార్డ్స్

3174ఫిజిక్స్ లో విశేష కృషి చేసిన ఇద్దరు సైంటిస్టులకు ఈ ఏడాది నోబెల్ అవార్డు దక్కింది. టకాకి కజితా, ఆర్థర్ బి. మెక్ డొనాల్డ్ అనే ఇద్దరు సైంటిస్టులకు సంయుక్తంగా ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించింది ‘ద రాయర్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ టకాకి కజితా జపాన్ కు చెందిన శాస్త్రవేత్త కాగా..ఆర్థర్ కెనడాకు చెందిన వ్యక్తి. న్యూట్రినోలపై రిసెర్చ్ చేసిందుకు గాను వారికి ఈ అరుదైన అవార్డు దక్కింది. టకాకి కజితా జపాన్ లోని కషివా వర్శిటీ ఆఫ్ టోక్యోలో పనిచేస్తున్నారు. ఆర్థర్ మెక్ డొనాల్డ్ కింగ్ స్టన్ లోని క్వీన్స్ యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy