‘ఫిదా’ బ్యూటీకి మరో ఛాన్స్

FIDAA‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షలను ఆకట్టుకున్న సాయిపల్లవికి ఆఫర్లమీద ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. లేటెస్టుగా నాని హీరోగా ఆయన నిర్మించిన MCAలోనూ హీరోయిన్ సాయిపల్లవే. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో రెండుసార్లు నటించిన ఈ ఫిదా బ్యూటీకి మరోసారి అవకాశం ఇచ్చాడు రాజు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. నితిన్, శర్వానంద్ హీరోలుగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకున్నారట. దర్శక, నిర్మాతలు ఆమెను కలిసి, కథ చెప్పారట. పాత్ర బాగా నచ్చడంతో ఆమె నటించడానికి ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సినిమా యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy