
ఆపసోపాలు పడుతూ లేస్తూ, పట్టు చిక్కక ఏమాత్రం ఆశావహంగా కనిపించని ఇరాన్ కు ఊహించని కానుక ఇచ్చింది. 90+5 నిమిషంలో వంపులు తిరుగుతూ ఎడమవైపు నుంచి వచ్చిన క్రాస్ ఫ్రీ కిక్ ను తప్పించే యత్నంలో స్ట్రయికర్ అజీజ్ బుహాదూజ్ తమ గోల్ పోస్ట్ లోకే కొట్టుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో మొరాకో గోల్ కీపర్ మోనిర్ ఎల్ కజోయ్ నిస్సహాయంగా మిగిలిపోగా… తాము చేయని గోల్ తో విజయం దక్కిన ఇరాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. ప్రపంచకప్ లో 13 మ్యాచ్ లాడిన ఇరాన్ కు ఇది రెండో గెలుపు మాత్రమే కావడం గమనార్హం. 2010 తర్వాత ఓ ఆసియా జట్టు విజయం సాధించడమూ ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ కు ముందు ఇరాన్ కు లభించిన ఏకైక విజయం 1998 వరల్డ్ కప్లో అమెరికాపై 2–1తో దక్కింది. దీంతో 20 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ లో విక్టరీ సాధించింది ఇరాన్.
A late own goal see's Iran pick up their first victory in the #WorldCup since 1998. pic.twitter.com/CMlfHdSE1D
— World Cup 2018 (@WCGoalz) June 15, 2018