ఫిఫా వరల్డ్ కప్-2018లో భాగంగా శనివారం క్వార్టర్స్ లో స్వీడన్ తో జరిగిన మ్యాచ్లో 2-0తో గెలిచి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడి విజయం దక్కించుకుంది ఇంగ్లండ్ . మ్యాచ్ 30వ నిమిషంలో ఇంగ్లాండ్ కు తొలి గోల్ లభించింది. అయితే ప్రత్యర్ధి జట్టుపై రక్షణాత్మక శైలితో దాడులకు దిగే స్వీడన్ మాత్రం ఎవరూ ఊహించని పేలవ ప్రదర్శనతో ఓడిపోయింది. మొదటి భాగంలో చిన్న పొరపాట్లతో వెనుకంజ వేసిన స్వీడన్… రెండోభాగంలో కూడా ప్రభావవంతంగా ఆడే తమ లక్షణాన్ని ప్రదర్శించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. రష్యా, క్రొయేషియా జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తలపడుతుంది.