ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిర్యాదులకు ప్రత్యేక సెల్ : తలసాని

talasaniసినీ ఇండస్ట్రీలో వివాదానికి ఇవాళ్టీతో ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. క్యాస్టింగ్ కౌచ్, సినిమా రంగ సమస్యలపై సచివాలయంలో మంత్రితో సమావేశమైన సినీ పెద్దలు.. ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం, ఆరోపణలతో పాటు సమస్యలపై చర్చించారు. కో ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దుచేసేందుకు ఇండస్ట్రీ ఒప్పుకుందన్నారు మంత్రి తలసాని. ఇండస్ట్రీ తరఫున మాట్లాడేవాళ్లు పద్ధతిగా మాట్లాడాలన్నారు.

సినీ కార్మికులకు ఇచ్చే పారితోషకం నేరుగా బ్యాంకులో జమచేయాలన్నారు మంత్రి తలసాని. మహిళ రక్షణ విషయంలో కచ్చితమైన ఆలోచనతో ఉన్నామన్నారు. సినిమా టికెట్ల రేట్ల కంటే థియేటర్లలో అమ్మే ఆహార పదార్థాల రేట్లే ఎక్కువ ఉన్నయన్న మంత్రి…ఈ దోపిడీని సీరియస్ గా తీసుకున్నామన్నారు.

మరోవైపు జూనియర్ ఆర్టీస్టుల సమస్యలపై ఫిర్యాదుల కోసం FDCలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఛైర్మన్ రాంమ్మోహన్ రావు. ఇందులో 24 మంది ఉంటారన్నారు. ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మంత్రితో సమావేశానికి ముందు అన్నపూర్ణ  స్టూడియోలో 24 సినిమా విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు సినీ పెద్దలు. ఈ సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు,  కేఎస్ రామారావు,  సి.కల్యాణ్, దర్శకులు శంకర్, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్…మా అధ్యక్షుడు శివాజీరాజా, ఎన్వీ ప్రసాద్,  మా సభ్యురాలు  హేమతో పాటు మొత్తం 74 మంది హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చించిన ఇండస్ట్రీ పెద్దలు..యార్లగడ్డ సుప్రియ కన్వినర్ గా 21 మంది సభ్యులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అంశం మీదైన ఈ కమిటీదే తుది నిర్ణయమన్నారు.

మరోవైపు వేధింపుల నిరోదక కమిటీ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని…త్వరలో నివేదిక వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో 21 మంది సభ్యులు పనిచేస్తారని వారిలో సగం మంది ప్రజా సంఘాలు, లాయర్లు ఉంటారన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy