ఫిల్మ్ చాంబర్ కాదు.. రణస్థలం

pawan-ranastalamతెలుగు ఫిల్మ్ చాంబర్ రణస్థలం అయ్యింది. అమ్మను అవమానించటం, పవన్ కల్యాణ్ పై కుట్రకు నిరసనగా ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు పవన్ కల్యాణ్. ఆయనకు మద్దతుగా మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం తరలించారు. జనసేన కార్యకర్తలు, నేతలు, మెగా ఫ్యాన్స్ మొత్తం ఫిల్మ్ చాంబర్ కు రావటంతో అది రణస్థలంగా మారిపోయింది. కుట్రపై న్యాయపోరాటానికి సిద్ధం అయిన పవన్ కల్యాణ్.. లాయర్లతో చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో అల్లు అరవింద్, నాగబాబు, పరుచూరి వెంకటేశ్వర్లు ఇతర సీనియర్స్ పాల్గొన్నారు. వీరితో పాటు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ్ కూడా వచ్చారు. మెగా హీరోలు అందరూ రావటం, వారికి మద్దతుగా అభిమానులు వేలాది మంది తరలిరావటంతో.. ఫిల్మ్ చాంబర్ లో హైటెన్షన్ నెలకొంది.

పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా          ఫిల్మ్ చాంబర్ కు వచ్చారు. బాబాయ్ కి మద్దతు తెలిపారు. ఇక పవన్ కల్యాణ్ ఫిల్మ్ చాంబర్ వేదికగా దీక్ష చేయబోతున్నట్లు సమాచారం. ఈ దీక్షలో మెగా హీరోలు అందరూ కూర్చోబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రాకున్నా.. లాయర్లతో చర్చల తర్వాత పవన్ స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉందని జనసేన ప్రతినిధులు ప్రకటించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy