ఫీజు రీయింబర్స్ మెంట్ కు తగ్గిన దరఖాస్తులు

2106 - fee reimbursmentఫీజు రీయింబర్స్ మెంట్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగుస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గటంతో.. గతేడాదితో పోల్చితే.. అప్లికేషన్ల సంఖ్య కాస్త తగ్గింది. మొత్తంగా పదమూడున్నర లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి నుంచి, అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి అప్లికేషన్స్ అందాయి.

విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల దరఖాస్తులకు గడువు దగ్గరపడింది. మంగళవారంతో డెడ్ లైన్ ముగుస్తోంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు గడువు పొడిగించిన ప్రభుత్వం.. కొత్తగా స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అప్లయ్ చేయటంతో పాటు.. రెన్యువల్ కోసం ఈనెల 5వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఇప్పటి వరకు పదమూడున్నర లక్షల మంది.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, ఈబీసీ విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్నారు.

ఈసారి కొత్తగా 5లక్షల 85 వేల మంది విద్యార్థులు.. ఫీజ్ రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల కోసం అప్లయ్ చేసుకున్నారు. మరో 7లక్షల 65వేల మంది రెన్యువల్ కు దరఖాస్తు చేశారు. మొత్తం దరఖాస్తుల్లో బీసీ విద్యార్థుల నుంచి అత్యధికంగా 7లక్షల 48వేల దరఖాస్తులు అందాయి. రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా లక్షా 17వేల 229 మంది ఫ్రెష్ విద్యార్థులు, లక్షా 62వేల 912 మంది రెన్యువల్ విద్యార్థులు అప్లయ్ చేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్ నుంచి 34వేల 905 మంది కొత్తగా అప్లయ్ చేయగా.. 41వేల 726 మంది రెన్యువల్ చేసుకున్నారు.

గతేడాదితో పోల్చితే దరఖాస్తుల సంఖ్య కాస్త తగ్గిందని చెబుతున్నారు అధికారులు. 2014-15లో 13లక్షల 82వేల మంది అప్లయ్ చేశారని.. ఈసారి ఆ సంఖ్య కొంత తక్కువగా ఉందంటున్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడటంమే ఇందుకు కారణమని చెబుతున్నారు అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy