ఫుడ్ ఇన్ స్పెక్టర్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలు

acbఆదిలాబాద్ ఫుడ్ ఇన్ స్పెక్టర్ బాపూజీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో… ఈ తనిఖీలు చేస్తున్నారు. బాపూజీ ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో కూడా అధికారులు ఒకేసారి దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో మూడు చోట్ల, ఆదిలాబాద్ లో రెండు చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో సోమాజిగూడ, బండ్లగూడ జాగీర్, మేడ్చల్ లోని ఇళ్లతో పాటు.. ఆదిలాబాద్ లోని ఇళ్లు, ఆఫీసులో సోదాలు చేశారు. సోమాజీగూడలోని ఇంట్లో 2 లక్షల రూపాయల నగదు, 260 గ్రాముల బంగారం, అరకిలో వెండితో పాటు… బండ్లగూడలో కోటిన్నర విలువైన విల్లా, మేడ్చల్ లో వ్యవసాయ స్థలం, రెండు బ్యాంకు ఖాతాలు, ఒక లాకర్ ను గుర్తించారు ఏసీబీ అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy