ఫెడరల్ ఫ్రంట్ ఒక ప్రత్యామ్నాయం: కేకే

kk
TRS అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ దేశ గతిని మార్చే ఒక ప్రత్యామ్నాయమన్నారు ఎంపీ కె.కేశవరావు. రాష్ట్రాలపై కేంద్రం ఆదిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇది ఎంతో అవసరమన్నారు. ప్లీనరీలో రాజకీయ తీర్మానాన్ని ఆయన ప్రవేశ పెట్టారు. పోరాట పటిమ ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలకు కొత్త నిర్వచనం  ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. దేశంలో గుణాత్మక మార్పును తీసుకువచ్చేందుకు నడుం కట్టిన నేత కేసీఆర్  కు ప్రజలందరు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

కేకే ప్రవేశ పెట్టిన రాజకీయ తీర్మానాన్ని  బలపరిచారు ఎంపీ వినోద్ కుమార్. సుదీర్ఘ పోరాటం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో TRS చేసిన పోరాటం బహుశా స్వాతంత్ర్యోద్యమం తర్వాత  ఇదే అతి పెద్ద పోరాటమన్నారు  వినోద్ కుమార్.

అంతకు ముందు ప్లీనరీలో స్వాగతోపన్యాసం చేసిన బస్వరాజు సారయ్య….వ్యవసాయ విధానంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. స్వరాష్ట్రంలో తలెత్తుకుని సగౌరవంగా జీవిస్తున్నామంటే అందుకు సీఎం కేసీఆర్ విధానాలు… పథకాలేకారణమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy